పీవీ, ఎన్టీఆర్‌ కు భారతరత్న ప్రకటించాలి

ABN , First Publish Date - 2020-11-27T07:40:12+05:30 IST

బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే మాజీ ప్రధాని పీవీ నరసింహారావు, మాజీ సీఎం ఎన్టీఆర్‌కు వెంటనే భారతరత్నను ప్రకటించాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల

పీవీ, ఎన్టీఆర్‌ కు భారతరత్న ప్రకటించాలి

 బీజేపీకి ఎమ్మెల్సీ కవిత డిమాండ్‌

హైదరాబాద్‌/కవాడిగూడ/చిక్కడపల్లి, నవంబరు 26 (ఆంధ్రజ్యోతి): బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే మాజీ ప్రధాని పీవీ నరసింహారావు, మాజీ సీఎం ఎన్టీఆర్‌కు వెంటనే భారతరత్నను ప్రకటించాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఓట్ల కోసమే పీవీ సమాధి వద్ద బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ రాజకీయ డ్రామాలు ఆడుతున్నారని ఆమె విమర్శించారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం దోమలగూడ జాగృతి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. అలాగే, గాంధీనగర్‌ డివిజన్‌లో మాట్లాడారు.


టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పీవీ శతజయంతి ఉత్సవాలను నిర్వహిస్తుంటే.. బీజేపీ, కాంగ్రెస్‌ నేతలు ఒక్క రోజు కూడా ఆయన గురించి మాట్లాడలేదని చెప్పారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికలు రాగానే ఒక పార్టీ పీవీపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తే.. మరోపార్టీ దానిని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. పాతబస్తీలో రొహింగ్యాలు ఉన్నారంటూ  బీజేపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై ఆమె స్పందించారు. దేశంలో విదేశీయులుండటం కేంద్ర ప్రభుత్వ వైఫల్యమని, రాష్ట్ర ప్రభుత్వానిది కాదన్నారు.

ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను చించేస్తున్న బీజేపీ నేతల విచిత్ర ప్రవర్తనను ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. బీజేపీ దేవుడి పేరుతో రాజకీయాలు చేస్తోందని విమర్శించారు.


Read more