పగిలిన మిషన్ భగీరథ పైప్ లైన్

ABN , First Publish Date - 2020-12-29T20:02:25+05:30 IST

సిద్ధిపేట జిల్లా: తోటపల్లి, గాగిల్లాపూర్ గ్రామాల మధ్య మిషన్ భగీరథ పైప్ లైన్ పగిలి..

పగిలిన మిషన్ భగీరథ పైప్ లైన్

సిద్ధిపేట జిల్లా: తోటపల్లి, గాగిల్లాపూర్ గ్రామాల మధ్య మిషన్ భగీరథ పైప్ లైన్ పగిలి.. నీరు వృధాగా పోతోంది. సిద్ధిపేట జిల్లాలోని నంగనూరు, చిన్నకోడూరు, సిద్ధిపేటకు కరీంనగర్ ఎల్ఎండీ నుంచి మంచినీటి సరఫరా ఈ పైప్ లైన్ ద్వారానే జరుగుతుంది. రాజీవ్ రహదారి పక్కన పైప్ పగలడంతో రోడ్డుపై నీళ్లు విరజిమ్ముతున్నాయి. నీరు భారీగా వృధాగా పోతుండడంతో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. పగిలిన పైప్ లైన్లను మరమత్తులు చేసేందుకు సంబంధిత శాఖ అధికారులు నీటి సరఫరాను నిలిపివేశారు. మరో రెండు రోజుల వరకు సిద్ధిపేటకు మంచినీటి సరఫరా నిలిచిపోనుంది. రాజీవ్ రహదారిపై ప్రవహిస్తున్న నీరు పక్కనే ఉన్న వేరుశెనగ పంటను ముంచింది.

Updated Date - 2020-12-29T20:02:25+05:30 IST