భద్రాచలంలో వైభవంగా అధ్యయనోత్సవాలు

ABN , First Publish Date - 2020-12-19T13:33:08+05:30 IST

శ్రీసీతారామచంద్ర స్వామివారి వైకుంఠ ఏకాదశి ప్రయుక్త అధ్యయనోత్సవాలను అధికారులు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు.

భద్రాచలంలో వైభవంగా అధ్యయనోత్సవాలు

నేడు వామనావతారంలో రామయ్య


భద్రాద్రి: శ్రీసీతారామచంద్ర స్వామివారి వైకుంఠ ఏకాదశి ప్రయుక్త అధ్యయనోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా నేడు ఐదోరోజు వామనావతారంలో రామయ్య భక్తులకు దర్శనమివ్వనున్నారు.  అలాగే ముక్కోటికి సంబంధించిన ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి.  ఈ నెల 24, 25వ తేదీల్లో శ్రీ సీతారామచంద్రస్వామివారి తెప్పోత్సవం జరగనుంది. ఉత్తరద్వార దర్శనాలకు కోవిడ్-19 నిబంధనల దృష్ట్యా కేవలం అంతరంగికముగా నిర్వహిస్తున్నట్లు దేవాదాయశాఖ తెలిపింది. గోదావరి నదిలో హంసవాహనంపై తెప్పోత్సవం రద్దు చేసి ఆలయ ప్రాంగణంలోని చిత్రకూట మండపం ఎదురుగా నిర్మించిన నీటి కొలనులో స్వామివారికి తెప్పోత్సవం నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు.  కోవిడ్-19 దృష్ట్యా ఈసారి ఉత్తరద్వార దర్శనానికి భక్తులకు అనుమతి లేదని ఆలయ అధికారులు పేర్కొన్నారు. 

Read more