భద్రాద్రి రామయ్యకు వైభవంగా ఊంజల్ సేవ
ABN , First Publish Date - 2020-04-07T09:39:37+05:30 IST
భద్రాచలం దేవస్థానంలో నిర్వహిస్తున్న శ్రీరామనవమి బ్రహ్మత్సోవాల్లో భాగంగా సోమవారం రాత్రి స్వామి వారికి వైభవంగా ఊంజల్ సేవ నిర్వహించారు. నిత్య కల్యాణ మండప వేదిక వద్ద శ్రీ సీతారామచంద్ర లక్ష్మణ స్వాములను

భద్రాచలం, ఏప్రిల్ 6 : భద్రాచలం దేవస్థానంలో నిర్వహిస్తున్న శ్రీరామనవమి బ్రహ్మత్సోవాల్లో భాగంగా సోమవారం రాత్రి స్వామి వారికి వైభవంగా ఊంజల్ సేవ నిర్వహించారు. నిత్య కల్యాణ మండప వేదిక వద్ద శ్రీ సీతారామచంద్ర లక్ష్మణ స్వాములను ప్రత్యేక ఉయ్యాల్లో ఆసీనులను చేసి భక్త రామదాసు, తూము నరసింహదాసు కీర్తనలను ఆలపించారు.