కరోనా రహిత జిల్లాగా భద్రాద్రి కొత్తగూడెం..

ABN , First Publish Date - 2020-04-08T16:35:52+05:30 IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరోనా రహిత జిల్లాగా అడుగులేస్తోంది.

కరోనా రహిత జిల్లాగా భద్రాద్రి కొత్తగూడెం..

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరోనా రహిత జిల్లాగా అడుగులేస్తోంది. తెలంగాణలో లాక్ డౌన్ ప్రారంభమయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ జిల్లాలో ఒక్క కరోనా పాజిటీవ్ కేసూ నమోదుకాలేదు. విదేశీయులు ఇద్దరూ కోలుకున్నారు. మరో ఇద్దరి కరోనా బాధితుల ఆరోగ్యం మెరుగ్గా ఉంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తొలి కేసు మార్చి 14న, రెండో కేసు మార్చి 22న నమోదయింది. ఈ రెండు కేసులు కూడా విదేశీయులే కావడంతో వారికి పాజిటీవ్ వచ్చింది. ఇప్పుడు వారిద్దరూ రికవరయ్యారు. గత 15 రోజులుగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఒక్క కరోనా పాజిటీవ్ కేసు కూడా నమోదు కాకపోవడంతో జిల్లా యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది.

Updated Date - 2020-04-08T16:35:52+05:30 IST