ఆ భూములు కోసం రంగంలోకి సీలింగ్ వారసులు..!

ABN , First Publish Date - 2020-06-23T00:52:40+05:30 IST

అడవినే నమ్ముకున్న ఆదివాసీయులు దశాబ్దాల క్రితం సర్కార్ సీలింగ్ యాక్ట్‌లో ఇచ్చిన భూముల్నే వారు సాగు చేసుకుంటున్నారు..

ఆ భూములు కోసం రంగంలోకి సీలింగ్ వారసులు..!

భద్రాద్రి కొత్తగూడెం: అడవినే నమ్ముకున్న ఆదివాసీయులు దశాబ్దాల క్రితం సర్కార్ సీలింగ్ యాక్ట్‌లో ఇచ్చిన భూముల్నే వారు సాగు చేసుకుంటున్నారు. ఆ భూమే వారికి జీవనాధారం. కానీ నలభై ఏళ్ల తర్వాత ఇప్పుడు ఆ భూములు మాయి అంటూ కొందరు సీలింగ్ వారసులు రంగంలోకి దిగారు. ఆ వారసుల ముసుగులో మైనింగ్ మాఫియా ఆదివాసీయుల భూములపై కన్నేసింది. ఆదివాసీయులను తరిమికొట్టి వేల ఎకరాల్లో నిక్షేపాలుగా ఉన్న లాటరైట్ నిక్షేపాలను కొల్లగొట్టేందుకు పథకం వేసింది. 


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలం మామిడిగుండాలలో ఆదివాసీయులు ఏళ్ల తరబడి ఉన్నారు. పచ్చని కొండల మధ్య ఎంతో ఆహ్లాదకర వాతావరణంలో ఉండే ఆదివాసీయులు భూమినే నమ్ముకున్నారు. ఎంతో సంతోషంగా సాగిపోతున్న వారి జీవితాలు నాశనం చేసేందుకు కోరలు చాచింది మైనింగ్ మాఫియా. మామిడిగుండాలతో పాటు సువర్ణాపురం, మేడిగుట్ట, ఒటిగుప్పు, రాజ్యతండా, ధనియాలపాడు గ్రామాల పరిధిలో 4 వేల ఎకరాలకు పైగా భూముల్లో లాటరైట్ నిక్షేపాలు ఉన్నాయి. అక్కడ మైనింగ్ చేయాలంటే ఎలాగైనా ఆ భూముల్లో సాగు చేసుకుంటున్న ఆదివాసీయులను తరిమికొట్టాలని పథకం వేశారు. 1973 సీలింగ్ యాక్ట్ ప్రకారం దాదాపు 600 కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి 5 ఎకరాల చొప్పున  సర్వే నెంబర్ 130లో ఆదివాసీయులకు సీలింగ్ పట్టాలు ఇచ్చారు. పట్టాలిచ్చేటప్పుడు కొండలు, గుట్టలతో నిండిన భూములు కావడంతో ఆదివాసీయులు తమ రెక్కల కష్టంతో వాటిని సాగు భూములుగా మార్చారు. 40 ఏళ్లుగా సాగు చేసుకున్నప్పటికీ పాలకులు వారికి ఎలాంటి హద్దుల కేటాయించలేదు. పాస్ బుక్స్ ఇవ్వలేదు. కానీ ఆదివాసీయులంతా ఎలాంటి హద్దుల వివాదాలు లేకుండా సర్దుకుపోతున్నారు. కానీ ఇప్పుడు వారికి పెద్దకష్టమే వచ్చింది. 


Updated Date - 2020-06-23T00:52:40+05:30 IST