గంటలో రెండు సెల్‌ఫోన్లు స్నాచింగ్‌

ABN , First Publish Date - 2020-09-05T20:05:46+05:30 IST

గంట వ్యవధిలోనే వారు రెండు వేర్వేరు పోలీ్‌సస్టేషన్ల పరిధిలో రెండు సెల్‌ఫోన్లను చోరీ చేశారు. హుమాయున్‌నగర్‌ పీఎస్‌, బంజారాహిల్స్‌ పీఎ్‌సలో ఈ మేరకు కేసులు నమోదయ్యా యి...

గంటలో రెండు సెల్‌ఫోన్లు స్నాచింగ్‌

  • వేర్వేరు పోలీ్‌సస్టేషన్ల పరిధిలో చోరీలు
  • నిందితులు మాత్రం సేమ్‌


మొబైల్‌ స్నాచింగ్‌ల బెడద పెరుగుతోంది. ఈ కొత్తరకం నేరగాళ్ల బెడద అనేక ప్రాంతాలలో ఉంటున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయి. ఏ కాస్త పరధ్యానంగా ఉన్నా చేతుల్లో ఉన్న మొబైల్‌ను లాగేసుకుని పారిపోతున్న సంఘటనలు పెరుగుతున్నాయి. వీటిల్లో కేసుల దాకా వచ్చేవి కొన్ని మాత్రమే. 


హైదరాబాద్‌ సిటీ, సెప్టెంబర్‌ 4 (ఆంధ్రజ్యోతి): గంట వ్యవధిలోనే వారు రెండు వేర్వేరు పోలీ్‌సస్టేషన్ల పరిధిలో రెండు సెల్‌ఫోన్లను చోరీ చేశారు. హుమాయున్‌నగర్‌ పీఎస్‌, బంజారాహిల్స్‌ పీఎ్‌సలో ఈ మేరకు కేసులు నమోదయ్యా యి. దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు.  గత నెల 29న రాత్రి 9.45 గంటల సమయంలో బంజారాహిల్స్‌ ఇందిరానగర్‌ నివాసి నారిశెట్టి బాలరాజు కేబీఆర్‌ పార్కు వద్ద నడుచుకుంటూ వెళ్తుండగా, ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి అతని ఫోన్‌ లాక్కొని పారిపోయారు. బాధితుడు బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అదే రాత్రి ఆక్టివా వాహనంపై ఇద్దరు అక్కాచెళ్లెళ్లు బంజారాహిల్స్‌ కేర్‌  ఆస్పత్రి నుంచి తమ నివాసమైన సరూర్‌నగర్‌కు వెళ్తున్నారు. దారిలో మహవీర్‌ ఆస్పత్రి వద్ద రాత్రి 10.50 గంటల సమయంలో ఫోన్‌ కాల్‌ రావడంతో, వాహ నం ఆపి వారిలో ఒకరైన షాగుఫ్తాఖాన్‌ ఫోన్‌లో మాట్లాడుతున్నారు. ఎదురుగా వచ్చిన ఇద్దరు యువకులు యువతి మాట్లాడుతున్న ఫోన్‌ లాక్కుని పారిపోయారు. అదే రోజు రాత్రి వారిద్దరూ హుమాయున్‌ నగర్‌ పీఎ్‌సలో ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు సాంకేతికతతోపాటు సీసీ కెమెరాల ఫుటేజీ ద్వారా రెండు ఘటనల్లో నిందితులు ఒకరేనని గుర్తించారు. శుక్రవారం వారిని పట్టుకున్నారు.


నిందితులు మహబూబాబాద్‌ జిల్లా సత్యనారాయణపురం నివాసి లింగోజు ఉదయ్‌చారి (21), మెదక్‌ జిల్లా దామరచర్ల నివాసి గొల్లరాజు (24)లుగా గుర్తించారు. వారి నుంచి తస్కరణకు గురైన రెండు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులకు సంబంధించిన రెండు సెల్‌ఫోన్లు, స్నాచింగ్‌కు వినియోగించిన బైకును కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను పట్టుకోవడంలో చొరవ చూపిన పోలీసు సిబ్బందిని వెస్ట్‌జోన్‌ జాయింట్‌ సీపీ ఏఆర్‌ శ్రీనివాస్‌ అభినందించారు.   

Updated Date - 2020-09-05T20:05:46+05:30 IST