రాష్ట్ర విత్తన ధ్రువీకరణ సంస్థకు ఉత్తమ అవార్డు

ABN , First Publish Date - 2020-12-06T08:21:04+05:30 IST

తెలంగాణ రాష్ట్ర విత్తన ధ్రువీకరణ సంస్థకు ఉత్తమ అవార్డు లభించింది. రాష్ట్ర డైరెక్టర్‌ డాక్టర్‌ కేశవులు ఈ

రాష్ట్ర విత్తన ధ్రువీకరణ సంస్థకు ఉత్తమ అవార్డు

హైదరాబాద్‌, డిసెంబరు 5 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్ర విత్తన ధ్రువీకరణ సంస్థకు ఉత్తమ అవార్డు లభించింది. రాష్ట్ర డైరెక్టర్‌ డాక్టర్‌ కేశవులు ఈ అవార్డును స్వీకరించారు. జూమ్‌ ఆన్‌లైన్‌ వేదికపై శనివారం కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌, జాతీయ వర్షాధార పంటల ప్రాధికార సంస్థ అశోక్‌ ధాల్వాయ్‌, కేంద్ర ప్రభుత్వ అధికారుల ఆధ్వర్యంలో అగ్రికల్చర్‌ టుడే గ్రూప్‌ ఈ పురస్కారాన్ని అందించింది.


Read more