హైదరాబాద్‌లో ఆరెస్సెస్ సమావేశం ప్రారంభం
ABN , First Publish Date - 2020-10-31T09:14:40+05:30 IST
హైదరాబాద్‌లో ఆరెస్సెస్ సమావేశం ప్రారంభం

హైదరాబాద్, అక్టోబరు 30: రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆరెస్సెస్) రెండు రోజుల దక్షిణ మధ్య క్షేత్ర సమావేశం హైదరాబాద్‌లో శుక్రవారం ప్రారంభమైంది. తమ శాఖల విస్తరణతో పాటు సామాజిక సేవల కార్యకలాపాలు, జాతీయ అంశాలకు సంబంధించిన విషయాలపై ఈ సమావేశంలో సంఘ్ నేతలు చర్చిస్తున్నారు. శుక్రవారం జరిగిన సమావేశంలో ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భాగవత్ హాజరయ్యారు. శనివారం జరిగే భేటీలో కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి కీలక నేతలు హాజరవుతారని ఆరెస్సెస్ ఓ ప్రకటనలో తెలిపింది.