బీడీలు చుట్టి.. రూ. 20 వేల విరాళం
ABN , First Publish Date - 2020-04-05T07:20:18+05:30 IST
కరోనాపై పోరుకు నేను సైతం అం టూ ఓ బీడీ కార్మికురాలు ముందుకొచ్చింది. బీడీలు చుడ్తూ కొన్ని నెలలుగా కష్టపడి సంపాదించిన రూ.20 వేలను సీఎం సహాయనిధికి...

- రూ.25 లక్షలిచ్చిన గీతమ్ అధ్యక్షుడు శ్రీ భరత్
- పోలీసుల సంక్షేమానికి రూ.50 లక్షలిచ్చిన సువెన్ ఫార్మా
(ఆంధ్రజ్యోతి న్యూస్ నెట్‌వర్క్) : కరోనాపై పోరుకు నేను సైతం అం టూ ఓ బీడీ కార్మికురాలు ముందుకొచ్చింది. బీడీలు చుడ్తూ కొన్ని నెలలుగా కష్టపడి సంపాదించిన రూ.20 వేలను సీఎం సహాయనిధికి ఇచ్చింది. నిర్మల్ జిల్లా బాసర మండలం కిర్గుల్(బి) గ్రామానికి చెందిన ఆరెపల్లి పోసాని శనివారం బాసర తహసీల్దార్ శివప్రసాద్, ఎస్సై రాజుకు చెక్కు అందజేసింది. గీతమ్ అధ్యక్షుడు శ్రీ భరత్ సీఎం సహాయ నిధికి రూ.25 లక్షల విరాళాన్ని అందజేశారు. చెక్కును మంత్రి కేటీఆర్‌కు అందజేశారు. తెలంగాణ పోలీసుల సంక్షేమానికి కాకినాడ సీ పోర్టు రూ.25 లక్షల చెక్కును డీజీపీ మహేందర్ రెడ్డికి అందజేశారు. పోలీసులకు సువెన్ ఫార్మా రూ. 50 లక్షల విరాళం ఇచ్చింది. హైదరాబాద్‌లోని ఎస్‌ఆర్‌నగర్‌కు చెందిన అభిరుచి స్వగృహ ఫుడ్స్ ఎండీ కిషోర్ నాయుడు రూ.10 లక్షల చెక్కును మంత్రి తలసానితో కలిసి కేటీఆర్‌కు అందజేశారు.
చిలకలగూడకు చెందిన బాలాంజనేయ స్వామి ఆలయ చైర్మన్, పారిశ్రామికవేత్త నాగులూరి సాయిబాబా సీఎం సహాయ నిధికి రూ.10 లక్షలు ఇచ్చారు. రవి ఫుడ్స్ తరఫున ఆసంస్థ చైర్మన్ రమేశ్ కుమార్ అగర్వాల్ మంత్రి కేటీఆర్‌ను కలిసి రూ.25 లక్షల చెక్‌ను అందజేశారు. కాగా, హెల్త్ వర్కర్లకు పర్సనల్ ప్రొటెక్షన్ కిట్లు(పీపీఈ) అందించడానికి అసోసియేషన్ ఆఫ్ సర్జన్స్ ఆఫ్ ఇండియా(ఏఎ్‌సఐ) రూ.35 లక్షల విరాళాన్ని ప్రకటించింది. ఈ డబ్బుతో 35 వేల పీపీఈలు కొనుగోలు చేయవచ్చని అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ రఘురాం తెలిపారు.