కాగజ్‌నగర్‌లో ఎలుగుబంటి పట్టివేత
ABN , First Publish Date - 2020-03-25T10:36:21+05:30 IST
కుమరం భీం జిల్లా కాగజ్‌నగర్‌లో మంగళవారం వేకువ జామున మార్కెట్ ఏరియాలోకి వచ్చిన ఎలుగుబంటిని పట్టుకున్నారు. ఉదయం 6 గంటలకు తీరందాజ్ టాకీస్ పక్కనున్న

కాగజ్‌నగర్, మార్చి 24: కుమరం భీం జిల్లా కాగజ్‌నగర్‌లో మంగళవారం వేకువ జామున మార్కెట్ ఏరియాలోకి వచ్చిన ఎలుగుబంటిని పట్టుకున్నారు. ఉదయం 6 గంటలకు తీరందాజ్ టాకీస్ పక్కనున్న సందులో ఎలుగుబంటి నక్కింది. ఎఫ్‌డీఓ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో మధ్యాహ్నం 3 గంటలకు రెస్క్యూటీం మత్తు మందు ఇచ్చి పట్టుకోవటంతో పట్టణవాసులు ఊపిరి పీల్చుకున్నారు. అధికారులు ఎలుగుబంటిని అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లి వదిలేశారు.