కరోనా టీకా పంపిణీకి సిద్ధంగా ఉండండి

ABN , First Publish Date - 2020-12-01T08:42:40+05:30 IST

త్వరలో అందుబాటులోకి రానున్న కొవిడ్‌-19 టీకా పంపిణీకి సిద్ధంగా ఉండాలని కేంద్ర కేబినేట్‌ కార్యదర్శి రాజీవ్‌ గౌబా రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులకు సూచించారు

కరోనా టీకా పంపిణీకి సిద్ధంగా ఉండండి

సీఎ్‌సలతో కేంద్ర కేబినెట్‌ కార్యదర్శి రాజీవ్‌ గౌబా


హైదరాబాద్‌, నవంబరు 30(ఆంధ్రజ్యోతి): త్వరలో అందుబాటులోకి రానున్న కొవిడ్‌-19 టీకా పంపిణీకి సిద్ధంగా ఉండాలని కేంద్ర కేబినేట్‌ కార్యదర్శి రాజీవ్‌ గౌబా రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులకు సూచించారు. అవసరమై న ఏర్పాట్లపై సమీక్షించాలని పేర్కొన్నారు. దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులతో సోమవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ‘ప్రాధాన్య సమూహాలకు తొలిగా టీకా’ ఇవ్వనున్నామంటూ ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. ఈ నెల 6వ తేదీలోపు రాష్ట్ర స్టీరింగ్‌ కమిటీ సమావేశం, అనంతరం రాష్ట్ర, జిల్లా, బ్లాక్‌ స్థాయి టాస్క్‌ఫోర్స్‌ కమిటీ సమావేశాలను నిర్వహించాలని నిర్దేశించారు. సమావేశంలో తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌, డీజీపీ మహేందర్‌రెడ్డి, జీఏడీ ముఖ్యకార్యదర్శి వికా్‌సరాజ్‌, హోం, వైద్య ఆరోగ్య శాఖల కార్యదర్శులు రవి గుప్తా, రిజ్వీ, అదనపు డీజీ జితేందర్‌ పాల్గొన్నారు.

Updated Date - 2020-12-01T08:42:40+05:30 IST