తీర్పుల్లో సొంత మనోభావాలు తగవు

ABN , First Publish Date - 2020-04-25T09:37:24+05:30 IST

ఉమ్మడి ఏపీలో ప్రభుత్వం ఇచ్చిన జీవో నెంబరు 3 ప్రకారం ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనులకు 100ు రిజర్వేషన్లను కొట్టేస్తూ ఇచ్చిన తీర్పులో..

తీర్పుల్లో సొంత మనోభావాలు తగవు

వ్యాజ్యంలో భాగస్వామి అవుతాం: బీసీ సంక్షేమ సంఘం


రాంనగర్‌, ఏప్రిల్‌ 24(ఆంధ్రజ్యోతి): ఉమ్మడి ఏపీలో ప్రభుత్వం ఇచ్చిన జీవో నెంబరు 3 ప్రకారం ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనులకు 100ు రిజర్వేషన్లను కొట్టేస్తూ ఇచ్చిన తీర్పులో న్యాయమూర్తులు తమ సొంత మనోభావాలను వ్యక్తం చేశారని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం ఆక్షేపించింది. కాలదోషం పట్టిన పిటిషన్‌పై వచ్చిన ఈ తీర్పు, దానిపై అసంబద్ధ వ్యాఖ్యలు న్యాయ వ్యవస్థ గౌరవాన్ని ఇనుమడించేలా లేవని సంఘం అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. సామాజిక అసమానతలు, ఆర్థిక వెసులుబాట్లపై గణాంకాలు లేవని, కేసుకు సంబంధం లేని అంశాలతో రాజ్యాంగ మూలాల మార్పును ప్రస్తావించడంపై సంఘం తదనంతర వ్యాజ్యంలో భాగస్వామి అవుతుందని తెలిపారు.

Updated Date - 2020-04-25T09:37:24+05:30 IST