కుల వివక్ష నిర్మూలనే లక్ష్యంగా ఉద్యమించాలి

ABN , First Publish Date - 2020-12-28T05:05:20+05:30 IST

కుల వివక్ష నిర్మూలనే లక్ష్యంగా ఉద్యమించాలి

కుల వివక్ష నిర్మూలనే లక్ష్యంగా ఉద్యమించాలి

ములుగుటౌన్‌, డిసెంబరు 27: సమాజంలో కుల వివక్ష నిర్మాలనే లక్ష్యంగా ఉద్యమించాలని బీసీ పోరాట వేదిక రాష్ట్ర ఉపాఽధ్యక్షుడు ముంజాల భిక్షపతిగౌడ్‌ అన్నారు.    కుల వివక్షకు వ్యతిరేకంగా ఆ సంఘం ఆధ్వర్యంలో ములుగులో ఆదివారం నిరసన తెలిపారు. అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించి, మనుస్మృతిని దహనం చేశారు. అనంతరం బీసీ పోరాట వేదిక రాష్ట్ర అధ్యక్షుడు గుండు వెంకన్న అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో బిక్షపతి మాట్లాడారు. దేశంలో మతోన్మాదం విలయతాండవం చేస్తోందన్నారు. కంప్యూటర్‌ యుగమని చెబుతున్న నేటి సమాజంలో కుల వివక్ష, మత  అసహనం పెరిగి పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. కుల వివక్షపై ప్రతిఒక్కరూ పోరాడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో దుస్స రామన్న, వీరన్న, గుండాల రఘు, వాసాల మొండయ్య, నామాల చంద్రమౌళి, మాదారి భద్రయ్య, కుర్రి దినకరన్‌, సుందర్‌, నవీన్‌, రేలా విజయ్‌, గుండెమీది వెంకటేశ్వర్లు, రమేష్‌, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2020-12-28T05:05:20+05:30 IST