బంగాళాఖాతంలో అల్పపీడనం ?
ABN , First Publish Date - 2020-10-01T07:37:59+05:30 IST
వాయవ్య బంగాళాఖాతం, దానిని ఆనుకొని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో రాగల 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం.....
హైదరాబాద్, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి): వాయవ్య బంగాళాఖాతం, దానిని ఆనుకొని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో రాగల 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ప్రస్తుతం 7.6 కి.మీ ఎత్తువరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఈ ప్రభావంతోనే అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. రాజస్థాన్‌లోని మరికొన్ని ప్రాంతాలు, పంజాబ్‌లోని మిగిలిన ప్రాంతాలు, హరియాణా, చండీగఢ్, ఢిల్లీలోని కొన్ని ప్రాంతాలు, యూపీలోని మరికొన్ని ప్రాంతాల్లో నైరుతి రుతు పవనాలు ఉపసంహరించాయి. కాగా, రాగల రెండు రోజుల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.