బాసర ట్రిపుల్‌ ఐటీ నోటిఫికేషన్‌ విడుదల

ABN , First Publish Date - 2020-09-13T07:45:54+05:30 IST

బాసరలోని రాజీవ్‌ గాంధీ వైజ్ఙానిక సాంకేతిక విశ్వవిద్యాలయం(ట్రిపుల్‌ ఐటీ) నోటిఫికేషన్‌ శనివారం విడుదలైంది.

బాసర ట్రిపుల్‌ ఐటీ  నోటిఫికేషన్‌ విడుదల

16 నుంచి దరఖాస్తుల స్వీకరణ

జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ‘కటాఫ్‌’ రిలీజ్‌

కామన్‌ ర్యాంకు: 90.. ఈడబ్ల్యూఎస్‌: 70

ఎన్‌ఐటీ, ఐఐటీల్లో సీట్ల భర్తీకి

జేఓఎ్‌సఏఏ షెడ్యూలు విడుదల 

 

బాసర, సెప్టెంబరు 12 : బాసరలోని రాజీవ్‌ గాంధీ వైజ్ఙానిక సాంకేతిక విశ్వవిద్యాలయం(ట్రిపుల్‌ ఐటీ) నోటిఫికేషన్‌ శనివారం విడుదలైంది. దరఖాస్తులను 16 నుంచి అక్టోబరు 3వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో మాత్రమే స్వీకరిస్తామని ట్రిపుల్‌ ఐటీ పరిపాలనాధికారి రాజేశ్వర్‌రావు అన్నారు.

ప్రత్యేక కేటగిరీకి సంబంధించిన ఎన్‌సీసీ, స్పోర్ట్స్‌, క్యాప్‌, వికలాంగుల కోటా కింద దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు మాత్రం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడంతోపాటు తమ సర్టిఫికెట్‌ల కాపీలను అక్టోబరు 6వ తేదీలోగా యూనివర్సిటీకి పంపించాలన్నారు.

పూర్తి సమాచారం కోసం హెల్ప్‌లైన్‌ నెంబర్లు 95730 01992, 97037 60686ను సంప్రదించాలని సూచించారు. 


Updated Date - 2020-09-13T07:45:54+05:30 IST