బాన్సువాడలో కరోనా కలకలం.. పోలిస్ స్టేషన్ మూసివేత

ABN , First Publish Date - 2020-06-24T01:48:44+05:30 IST

బాన్సువాడలో కరోనా కలకలం సృష్టించింది. బాన్సువాడలోని చైతన్య కాలనీలో ఓ మహిళకు కరోనా పాజిటివ్ అని తేలింది. అయితే ఆ మహిళకు ప్రైమరీ కాంటాక్టుగా ఉన్న ఆమె కుమారుడు తనకు కూడా కరోనా

బాన్సువాడలో కరోనా కలకలం.. పోలిస్ స్టేషన్ మూసివేత

కామారెడ్డి: బాన్సువాడలో కరోనా కలకలం సృష్టించింది. బాన్సువాడలోని చైతన్య కాలనీలో ఓ మహిళకు కరోనా పాజిటివ్ అని తేలింది. అయితే ఆ మహిళకు ప్రైమరీ కాంటాక్టుగా ఉన్న ఆమె కుమారుడు తనకు కూడా కరోనా టెస్ట్ చేయాలని ప్రభుత్వ వైద్యులను కోరాడు. అయితే వారు దానికి నిరాకరించారు. దాంతో ఆ యువకుడు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తనకు టెస్ట్ చేయడం లేదంటూ నానా హంగామా చేశాడు. దీంతో పోలీసులు ఆ యువకుడిని ఆస్పత్రికి తరలించారు. అయితే సదరు యువకుడు కరోనా వచ్చిన మహిళకు ప్రైమరీ కాంటాక్టు కావడంతో పోలీసులు పోలీస్ స్టేషన్‌ను మూసివేశారు.

Read more