బ్యాంకుల ఎదుట చెత్త ఘటనపై ప్రభుత్వం సీరియస్

ABN , First Publish Date - 2020-12-28T02:44:11+05:30 IST

బ్యాంకుల ఎదుట చెత్త వేసిన ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ అయ్యింది. ఉయ్యూరు నగర పంచాయతీ కమిషర్ ప్రకాష్ రావుపై సస్పెండ్ చేసింది. అలాగే ఈ ఘటనకు సంబంధించి విజయవాడ, మచిలీపట్నం కమిషనర్లను రాష్ట్ర మునిసిపల్ శాఖ

బ్యాంకుల ఎదుట చెత్త ఘటనపై ప్రభుత్వం సీరియస్

విజయవాడ: బ్యాంకుల ఎదుట చెత్త వేసిన ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ అయ్యింది. ఉయ్యూరు నగర పంచాయతీ కమిషర్ ప్రకాష్ రావుపై సస్పెండ్ చేసింది. అలాగే ఈ ఘటనకు సంబంధించి విజయవాడ, మచిలీపట్నం కమిషనర్లను రాష్ట్ర మునిసిపల్ శాఖ కమిషనర్ విజయ్ కుమార్ వివరణ కోరారు. కాగా, రుణాలు ఇవ్వడం లేదనే కారణంగా కృష్ణా జిల్లాలోని పలు బ్యాంకుల ముందు పారిశుద్ధ్య కార్మికులు చెత్త పోసి నిరసన వ్యక్తం చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వార్త ఇప్పుడు పెద్ద వివాదాస్పదమయ్యింది. కేంద్ర పెద్దలు సైతం దీనిపై సీరియస్ అయ్యారు. రాష్ట్ర ఎంపీలతో దీనిపై చర్చించారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా దీన్ని సీరియస్‌గా పరిగణించింది.

Updated Date - 2020-12-28T02:44:11+05:30 IST