బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 14 భూవివాదంలో కొత్త కోణం

ABN , First Publish Date - 2020-08-10T00:07:14+05:30 IST

బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 14 భూవివాదంలో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. భూవివాదంలో నకిలీ పత్రాలు సృష్టించినట్లు ఏసీబీ గుర్తించింది. పాతబస్తీకి చెందిన సయ్యద్ ఖలీద్‌పై చర్యలు తీసుకోవాలని

బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 14 భూవివాదంలో కొత్త కోణం

హైదరాబాద్: బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 14 భూవివాదంలో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. భూవివాదంలో నకిలీ పత్రాలు సృష్టించినట్లు ఏసీబీ గుర్తించింది. పాతబస్తీకి చెందిన సయ్యద్ ఖలీద్‌పై చర్యలు తీసుకోవాలని, సీసీఎస్ పోలీసులకు ఏసీబీ ఫిర్యాదు చేసింది. గతంలో ఈ ల్యాండ్‌పై రెవెన్యూ అధికారుల నిర్ణయాన్ని సవాల్ చేస్తూ నిందితుడు సయ్యద్ ఖలీద్ హైకోర్టును ఆశ్రయించాడు. 2007లో షేక్‌పేట్ తహశీల్దార్ కార్యాలయం సర్వే చేసినట్లు డాక్యుమెంట్స్‌లో ఉన్నాయి. 2018లో ఆ డాక్యుమెంట్లను ఖలీద్ కోర్టుకు అందజేశాడు. స్థలం సర్వే చేసి భూమి ఖలీద్‌కు ఇవ్వాలని గతేడాది  న్యాయస్థానం ఉత్తర్వులిచ్చింది. ఖలీద్ సమర్పించిన అన్ని పత్రాలు నకిలీగా ఏసీబీ, సీసీఎస్ పోలీసులు తేల్చారు. ఈ కేసులో రూ.50 లక్షలు లంచం తీసుకుంటుండగా ఆర్ఐ నాగార్జునరెడ్డి, షేక్‌పెట్ ఎమ్మార్వో సుజాత, బంజారాహిల్స్ ఎస్సై రవీంద్ర నాయక్ ఏసీబీకి పట్టుబడ్డారు. బంజారాహిల్స్, గోల్కొండలో నిందితుడిపై 4 కేసులు నమోదయ్యాయి. నిందితుడు ఖలీద్‌తో పాటు లీగల్ అడ్వైజర్ అశోక్‌రెడ్డిని సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు.

Updated Date - 2020-08-10T00:07:14+05:30 IST