ప్రభుత్వ స్థలం కబ్జాకు యత్నం.. తరిమికొట్టిన స్థానికులు

ABN , First Publish Date - 2020-12-28T12:33:27+05:30 IST

ప్రభుత్వ స్థలం కబ్జాకు యత్నించిన కొందరిని

ప్రభుత్వ స్థలం కబ్జాకు యత్నం.. తరిమికొట్టిన స్థానికులు

హైదరాబాద్/బంజారాహిల్స్‌ : ప్రభుత్వ స్థలం కబ్జాకు యత్నించిన కొందరిని స్థానికులు అడ్డుకొని తరిమేశారు. బంజారాహిల్స్‌ రోడ్డు నెంబరు 12 శ్రీరాంనగర్‌ బస్తీకి ఆనుకొని సుమారు ఎకరం ప్రభుత్వ స్థలం ఉంది. ఇందులో కొంత స్థలంలో కమ్యూనిటీ హాల్‌ నిర్మించాలని బస్తీ వాసులు కోరుతున్నారు. ఆదివారం పది మంది వ్యక్తులు స్థలం వద్దకు వచ్చారు. సుమారు 400 గజాల ప్రభుత్వ స్థలంలోకి అక్రమంగా ప్రవేశించారు. స్థలాన్ని చదును చేయడం ప్రారంభించారు. గమనించిన బస్తీ వాసులు వారిని అడ్డుకున్నారు. కబ్జాదారులు బెదిరించే ప్రయత్నం చేయడంతో స్థానికులు ఎదురు తిరిగారు. వాగ్వాదం జరగడంతో కబ్జా దారులు అక్కడి నుంచి పారిపోయారు. స్థానికులు వారి ఫొటోలను రెవెన్యూ అధికారులకు అందజేశారు.

Updated Date - 2020-12-28T12:33:27+05:30 IST