బండి సంజయ్ ఢిల్లీలో దీక్ష చేయాలి: కడియం

ABN , First Publish Date - 2020-04-24T19:33:33+05:30 IST

బండి సంజయ్ ఉపవాస దీక్షను రాజకీయ డ్రామా..

బండి సంజయ్ ఢిల్లీలో దీక్ష చేయాలి: కడియం

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ ఉపవాస దీక్షను రాజకీయ డ్రామాగా మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అభివర్ణించారు. ప్రభుత్వం అన్ని విధాలుగా రైతులను ఆదుకుంటుందని చెప్పారు. బండి సంజయ్ ఢిల్లీలోని ప్రధాని కార్యాలయం ఎదుట దీక్ష చేసి రైతుల పక్షపాతి అని నిరూపించుకోవాలని కడియం సూచించారు.


దేశంలో ఎక్కడాలేని విధంగా రైతులను తెలంగాణ ప్రభుత్వం ఆదుకుంటోందని కడియం అన్నారు. తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత.. రైతు సంక్షేమం గురించి ఆలోచించి, రైతులకు అనేకరకాలుగా సహకారాన్ని అందిస్తుందని కడియం శ్రీహరి వ్యాఖ్యానించారు.

Updated Date - 2020-04-24T19:33:33+05:30 IST