జీహెచ్‌ఎంసీలో బండి సంజయ్ పాదయాత్ర
ABN , First Publish Date - 2020-09-16T09:51:35+05:30 IST
జీహెచ్‌ఎంసీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నగరంలో పాదయాత్ర ..

పార్లమెంటు సమావేశాల తర్వాత ప్రారంభం
హైదరాబాద్, సెప్టెంబరు 15 (ఆంధ్రజ్యోతి): జీహెచ్‌ఎంసీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నగరంలో పాదయాత్ర చేపట్టనున్నారు. ఈ నెలాఖరు వరకు పార్లమెంటు సమావేశాలు జరగనున్న దృష్ట్యా, వచ్చే నెల మొదటి వారంలో ఆయన యాత్ర ప్రారంభించే అవకాశం ఉంది. మొత్తం 150 డివిజన్ల పరిధిలో పాదయాత్ర కొనసాగేలా రూట్ మ్యాప్ సిద్ధమవుతోందని బీజేపీ వర్గాలు తెలిపాయి. కాగా, గ్రేటర్ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికకు సర్వే నిర్వహించనున్నట్లు సమాచారం.