మానవత్వం చాటుకున్న బండి సంజయ్
ABN , First Publish Date - 2020-12-30T12:13:30+05:30 IST
బండి సంజయ్ ఆ పార్టీ నాయకులతో కలిసి హైదరాబాద్‌కు బయలుదేరారు.
హైదరాబాద్/చందానగర్ : ఫిట్స్ వచ్చి ఓ మహిళ రోడ్డుపై పడింది. పక్కనే ఉన్న కుమార్తె ఏం చేయాలో తెలియక దిక్కుతోచని పరిస్థితిలో ఉంది. మంగళవారం జహీరాబాద్ నుంచి పార్టీ కార్యక్రమంలో పాల్గొనేందుకు రాష్ట్ర బీజీపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఆ పార్టీ నాయకులతో కలిసి హైదరాబాద్‌కు బయలుదేరారు. ఈ క్రమంలో చందానగర్‌కు రాగానే రోడ్డు పక్కన పడి ఉన్న మహిళను గమనించి, కారు దిగి ఆమె చేతిలో కారు తాళాలు పెట్టి కోలుకునే వరకు అక్కడే ఉండి మానవత్వాని చాటుకున్నారు. ఆ మహిళ పూర్తిగా కోలుకున్న తర్వాత ఆయన అక్కడి నుంచి హైదరాబాద్‌కు వెళ్లిపోయారు.