రైతు వేదికలను కొనుగోలు కేంద్రాలుగా మార్చండి: బండి సంజయ్
ABN , First Publish Date - 2020-12-28T22:13:31+05:30 IST
రైతు వేదికలను కొనుగోలు కేంద్రాలుగా మార్చాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ..

హైదరాబాద్: రైతు వేదికలను కొనుగోలు కేంద్రాలుగా మార్చాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యానించారు. కొనుగోలు కేంద్రాలు తీస్తామనడంలో కుట్ర ఉందని పేర్కొన్నారు. రైతులను గందర గోళంలో పడేయాడానికే కొనుగోలు కేంద్రాల ఎత్తివేత అని మండిపడ్డారు. రైతులతో రాష్ట్ర ప్రభుత్వం వ్యాపారం చేస్తోందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అబద్ధాల సీఎం అని రాష్ట్రంలో చర్చ జరుగుతోందన్నారు. రైతు చట్టాలు అర్థం చేసుకున్నందుకు సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. రైతు వేదికలను కేంద్రం నిధులతోనే నిర్మించారని చెప్పారు. పంట కొనుగోళ్లలో కూడా కేంద్రం వాటా ఉందని బండి సంజయ్ తెలిపారు.