కరోనా రావాలని కోరుకోవడం మూర్ఖత్వం: బండి సంజయ్

ABN , First Publish Date - 2020-04-07T18:41:25+05:30 IST

కరీంనగర్‌: తెలంగాణ సీఎం కేసీఆర్ తన ప్రెస్‌మీట్‌లో భాగంగా ఓ పత్రికపై విరుచుకుపడ్డారు.

కరోనా రావాలని కోరుకోవడం మూర్ఖత్వం: బండి సంజయ్

కరీంనగర్‌: తెలంగాణ సీఎం కేసీఆర్ తన ప్రెస్‌మీట్‌లో భాగంగా ఓ పత్రికపై విరుచుకుపడ్డారు. దీనిపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు. నేడు ఆయన మాట్లాడుతూ.. కరోనా రావాలని కోరుకోవడం మూర్ఖత్వమన్నారు. అహంకారంతో ఎవరినీ శాసించలేమని.. సీఎం ధోరణి మారాలన్నారు. కిట్ల కొరత ఉంటే వివరణ ఇవ్వాలని.. మీడియా వార్తలను విమర్శగా భావించొద్దన్నారు. మీడియా వార్తలను సూచనగా పాటించి పరిష్కారం చూపాలని బండి సంజయ్ పేర్కొన్నారు.


Read more