ఎన్నికల కమిషన్‌ను సస్పెండ్ చేయాలి: బండి సంజయ్

ABN , First Publish Date - 2020-12-01T22:48:25+05:30 IST

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోలింగ్ శాతం తగ్గడానికి టీఆర్ఎస్సేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. కేసీఆర్, ఇతర మంత్రులు తప్పుడు..

ఎన్నికల కమిషన్‌ను సస్పెండ్ చేయాలి: బండి సంజయ్

హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోలింగ్ శాతం తగ్గడానికి టీఆర్ఎస్సే కారణమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. కేసీఆర్, ఇతర మంత్రులు తప్పుడు ప్రకటనలతో  ప్రజలను భయపెట్టారని ఆయన వ్యాఖ్యానించారు. పోలింగ్ శాతాన్ని తగ్గించే కుట్ర టీఆర్ఎస్ చేసిందని చెప్పారు. ఎన్నికల ప్రక్రియ పూర్తిగా ఫెయిల్ అయిపోయిందని బండి సంజయ్ మండిపడ్డారు. రాష్ట్ర ఎన్నికల సంఘానికి సీపీఐ, సీపీఎం గుర్తు ఏదో కూడా తెలియకుండా ఉందన్నారు. ఎన్నికల కమిషన్ ను సస్పెండ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. 


Updated Date - 2020-12-01T22:48:25+05:30 IST