బీజేపీ మోర్చాలకు ఇన్‌ఛార్జ్‌లను నియమించిన బండి సంజయ్‌

ABN , First Publish Date - 2020-12-17T22:37:57+05:30 IST

రాష్ట్రంలో బీజేపీ సంస్థాగతంగా బలపడేందుకు సిద్ధమవుతోంది. అందుకోసం బీజేపీ మోర్చాలకు ఇన్‌ఛార్జ్‌లను ఆ పార్టీ నేత బండి సంజయ్‌ నియమించారు.

బీజేపీ మోర్చాలకు ఇన్‌ఛార్జ్‌లను నియమించిన బండి సంజయ్‌

హైదరాబాద్: రాష్ట్రంలో బీజేపీ సంస్థాగతంగా బలపడేందుకు సిద్ధమవుతోంది. అందుకోసం బీజేపీ మోర్చాలకు ఇన్‌ఛార్జ్‌లను ఆ పార్టీ నేత బండి సంజయ్‌ నియమించారు. బీజేపీ యువమోర్చా ఇన్‌ఛార్జ్‌గా దుగ్యాల ప్రదీప్‌ను ఎన్నుకున్నారు. కిసాన్ మోర్చా ఇన్‌ఛార్జ్‌గా ప్రేమేంధర్‌రెడ్డిని, ఎస్టీ మోర్చా ఇన్‌ఛార్జ్‌గా బంగారు శృతిని ఎన్నుకున్నారు. అంతేకాకుండా మహిళా మోర్చా ఇన్‌ఛార్జ్‌గా రాంచంద్రారెడ్డి, ఎస్సీ మోర్చా ఇన్‌ఛార్జ్‌గా మనోహర్‌రెడ్డి, బీసీ మోర్చా ఇన్‌ఛార్జ్‌గా యెండల లక్ష్మీనారాయణ, మైనారిటీ మోర్చా ఇన్‌ఛార్జ్‌గా ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్‌ను నియమించారు. దుబ్బాక ఉప ఎన్నికలో బీజేపీ గెలిచి టీఆర్‌ఎస్‌కు షాకిచ్చింది. అదే ఊపుతో గ్రేటర్‌లో కూడా ఆ పార్టీ సత్త చాటింది. దీంతో టీఆర్‌ఎస్‌కు తామే ప్రత్యామ్నాయమని బీజేపీ నేతలు నిరూపించారు. ఈ నేపథ్యంలోనే అన్ని వర్గాల్లో బీజేపీ చొచ్చుకుపోయేందుకు నిర్మాణాలను పటిష్టం చేసుకునేందుకు దృష్టి సారించింది. 


అంతేకాకుండా తెలంగాణలో బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్‌కు మరింత పదను పెడుతోంది. మరీ ముఖ్యంగా కాంగ్రెస్, టీఆర్‌ఎస్ బీజేపీ టార్గెట్ చేస్తూ పావులు కదుపుతోంది. గ్రేటర్‌ ఎన్నికల్లో విజయపరంపర కొనసాగించిన భారతీయ జనతాపార్టీ వైపు ఇతర పార్టీలకు చెందిన అనేకమంది నేతలు ఆకర్షితులవుతున్నారు. వచ్చే పార్లమెంట్‌, అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పటి నుంచే సన్నద్ధమవుతున్న బీజేపీ.. ఆయా పార్టీల్లో అసంతృప్తిగా ఉన్న నేతలను తమవైపు తిప్పుకునేందుకు పావులు కదుపుతోంది. ముఖ్యంగా కొందరు కాంగ్రెస్‌ నేతలతోపాటు అధికార టీఆర్‌ఎస్‌కు చెందిన నేతలతో కూడా చర్చలు మొదలు పెట్టింది.

Updated Date - 2020-12-17T22:37:57+05:30 IST