బాబ్రీపై కుట్ర కోణం అవాస్తవమని తేలింది: బండి సంజయ్
ABN , First Publish Date - 2020-10-01T08:30:27+05:30 IST
బాబ్రీ మసీదు కూల్చివేత ఘటనలో కుట్ర కోణం ఉందంటూ దశాబ్దాలుగా కొంతమంది చేసిన ప్రచారం.. సీబీఐ ప్రత్యేక కోర్టు....
న్యాయానికి ప్రతీక ఈ తీర్పు: డీకే అరుణ
బీజేపీ వాదన నిజమైంది: లక్ష్మణ్
రాష్ట్ర పార్టీ కార్యాలయంలో సంబురాలు
హైదరాబాద్, సెప్టెంబరు 30(ఆంధ్రజ్యోతి): బాబ్రీ మసీదు కూల్చివేత ఘటనలో కుట్ర కోణం ఉందంటూ దశాబ్దాలుగా కొంతమంది చేసిన ప్రచారం.. సీబీఐ ప్రత్యేక కోర్టు తీర్పుతో అవాస్తవమని తేలిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. బీజేపీని, హిందుత్వవాదులను దోషులుగా చూపి ఇన్నాళ్లూ పబ్బం గడుపుకొన్న పార్టీలు ఇప్పుడేం సమాధానం చెబుతాయని సంజయ్ నిలదీశారు. కాగా, తీర్పు నేపథ్యంలో నాంపల్లిలోని రాష్ట్ర పార్టీ కార్యాలయం వద్ద ఆ పార్టీ శ్రేణులు టపాసులు కాల్చి సంబురాలు చేసుకున్నాయి. కోర్టు తీర్పు న్యాయానికి, ధర్మానికి ప్రతీకని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ వ్యాఖ్యానించారు. బాబ్రీ మసీదు కూల్చివేత ఘటనలో కుట్ర కోణం లేదంటూ బీజేపీ ఇన్నాళ్లూ చేస్తున్న వాదన ఈ తీర్పుతో నిజమైందని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ అన్నారు. సంతుష్టీకరణ విధానాలతో చేసే రాజకీయాలకుబీజేపీ వ్యతిరేకమని.. ఒక మతానికి, వర్గానికి కాదని ఆయన స్పష్టం చేశారు.