కేసీఆర్.. అగ్రవర్ణ పేదల ద్రోహి: సంజయ్
ABN , First Publish Date - 2020-12-17T08:05:45+05:30 IST
కేసీఆర్.. అగ్రవర్ణ పేదల ద్రోహి: సంజయ్

హైదరాబాద్, డిసెంబరు 16(ఆంధ్రజ్యోతి): అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్ అమలు కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ అగ్రవర్ణ పేదల ద్రోహి అని విమర్శించారు. రాష్ట్రంలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అమలు చేయాలన్న డిమాండ్‌కు మద్దతివ్వాలని రెడ్డి జాగృతి వ్యవస్థాపక అధ్యక్షుడు పిట్ట శ్రీనివాసరెడ్డి, ఆర్య వైశ్య చైతన్య పోరాట సమితి అధ్యక్షుడు ప్రేమ్‌గాంధీతో కూడిన ప్రతినిధి బృందం బుధవారం బండి సంజయ్‌ను కలిసి విజ్ఞప్తి చేసింది. ఈ సందర్భంగా సంజయ్ మాట్లాడుతూ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కల్పిస్తూ కేంద్రం చట్టబద్ధ నిర్ణయం తీసుకుందని, వివిధ రాష్ట్రాల్లో దీన్ని అమలు చేస్తున్నారని గుర్తు చేశారు. తెలంగాణలో అమలు కాకపోవడం వల్ల సుమారు 65వేల మందికి నష్టం జరిగిందని ఆందోళన వ్యక్తం చేశారు.