కారోనా నివారణకు వైన్స్‌ల బంద్
ABN , First Publish Date - 2020-03-24T08:41:13+05:30 IST
కరోనా వైరస్ ప్రభలకుండా ముందస్తుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యల్లో భాగంగా జిల్లాలోని

వరంగల్‌రూరల్, మార్చి23: కరోనా వైరస్ ప్రభలకుండా ముందస్తుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యల్లో భాగంగా జిల్లాలోని మద్యం షాపులను ఈనెల 31వరకు మూసివేస్తున్నట్లు జిల్లా ఎక్సైజ్‌శాకాధికారి పి.శ్రీనివా్‌సరావు తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలోని నర్సంపేట, పరకాల, వర్దన్నపేట ఎక్సైజ్ సర్కిళ్ల పరిధిలోని అన్ని మండలాల్లో 56 మద్యం షాపులను మూసివేయాలని ఆదేశించామన్నారు. మద్యం అమ్మకాలను చేపట్టకుండా షాపులను సీజ్ చేసినట్లు తెలిపారు. ఇప్పటికే జిల్లాలోని మద్యం షాపుల పర్మిట్‌రూంలను, బార్‌లను మూసివేయగా సోమవారం ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు వైన్స్‌లను మూసినట్లు చెప్పారు. అక్రమంగా అమ్మకాలు నిర్వహించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బృందాలు జిల్లాలో పర్యటించి మద్యం దుకాణాలను తనఖీ చేస్తారని పేర్కొన్నారు.
అక్రమంగా రవాణా చేస్తున్న మద్య బాటిళ్ల స్వాధీనం
జిల్లాలోని నెక్కొండ ప్రాంతంలో అక్రమంగా అనుమతిలేని మద్యాన్ని రవాణా చేస్తున్న వ్యక్తిని తమ ఆధీనంలోకి తీసుకున్నట్లు ఎక్సైజ్ శాఖ డీటీ కరంచంద్ తెలిపారు. రూట్ వాచ్‌లో భాగంగా సోమవారం సాయంత్రం తనిఖీలు నిర్వహిస్తుండగా ద్విచక్రవాహనంపై మద్యం తరలిస్తుండగా పట్టుకుని కేసు నమోదు చేసినట్లు చెప్పారు. అదేవిధంగా గీత కార్మికులు ఇతరులకు దూరంగా ఉండాలని సూచించినట్లు తెలిపారు.