ఆయిల్‌ పామ్‌ సాగుకు 2.78 లక్షల హెక్టార్లు: నిరంజన్‌ రెడ్డి

ABN , First Publish Date - 2020-03-13T09:33:17+05:30 IST

రాష్ట్రంలో ఆయిల్‌ పామ్‌ సాగు కోసం 2.78 లక్షల హెక్టార్ల భూములను గుర్తించినట్లు వ్యవసాయ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తెలిపారు. ఈ పంటను ప్రోత్సహించడంలో

ఆయిల్‌ పామ్‌ సాగుకు 2.78 లక్షల హెక్టార్లు: నిరంజన్‌ రెడ్డి

హైదరాబాద్‌, మార్చి 12 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఆయిల్‌ పామ్‌ సాగు కోసం 2.78 లక్షల హెక్టార్ల భూములను గుర్తించినట్లు వ్యవసాయ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తెలిపారు. ఈ పంటను ప్రోత్సహించడంలో భాగంగా రాష్ట్రంలో త్వరలోనే ప్రత్యేక రీసెర్చి సెంటర్‌, ప్రాసెసింగ్‌ యూనిట్‌ను నెలకొల్పుతామని ఆయన అసెంబ్లీలో ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. తాను కూడా 8 ఎకరాల స్థలంలో ఆయిల్‌ పామ్‌ను సాగు చేస్తున్నట్లు వెల్లడించారు. ఎమ్మెల్యే బాల్క సుమన్‌ 12 ఎకరాల్లో ఇదే పంటను వేశారన్నారు. రాష్ట్రంలో  ప్రయోగాత్మకంగా ఇప్పటికే ఉమ్మడి మహబూబ్‌నగర్‌, ఆదిలాబాద్‌ జిల్లాల్లో 18,100 హెక్టార్ల విస్తీర్ణంలో ఆయిల్‌ పామ్‌ సాగవుతోందన్నారు. ఈ పంట సాగు కోసం ప్రత్యేక రాయితీలను ఇస్తున్నట్లు తెలిపారు.

Updated Date - 2020-03-13T09:33:17+05:30 IST