అప్పుడు బండి సంజయ్ ఎక్కడున్నాడు?: బాల్క సుమన్
ABN , First Publish Date - 2020-12-29T17:26:41+05:30 IST
కరీంనగర్: కేసీఆర్ ఉద్యమం స్టార్ట్ చేసినప్పుడు బండి సంజయ్ ఎక్కడున్నాడని ప్రభుత్వ చీఫ్ విప్ బాల్క సుమన్ ప్రశ్నించారు.
కరీంనగర్: కేసీఆర్ ఉద్యమం స్టార్ట్ చేసినప్పుడు బండి సంజయ్ ఎక్కడున్నాడని ప్రభుత్వ చీఫ్ విప్ బాల్క సుమన్ ప్రశ్నించారు. నేడు కరీంనగర్‌లో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రం వస్తేనే బీజేపీకి తెలంగాణ శాఖ ఏర్పడిందన్నారు. బండి సంజయ్‌కు అధ్యక్ష పదవి కేసీఆర్ భిక్ష అని ఆయన పేర్కొన్నారు. ఎంపీగా గెలిచిన సంజయ్ కరీంనగర్‌కు ఏం చేశాడని బాల్క సుమన్ ప్రశ్నించారు. కరీంనగర్‌కు జాతీయ రహదారులేవని నిలదీశారు. ఎస్‌ఈ ఆఫీసును తరలించింది ఎవరని ప్రశ్నించారు. ఎంపీగా గెలిచి కరీంనగర్‌కు ఒరిగబెట్టింది ఏంటన్నారు. కేసీఆర్‌ను తిట్టడం తప్ప ఏం చేశావని ప్రశ్నించారు. కాళేశ్వరానికి జాతీయ హోదా తెప్పించాలని బాల్క సుమన్ డిమాండ్ చేశారు.