హైదరాబాద్ బాలానగర్ ఫ్లైఓవర్‌పై అగ్నిప్రమాదం
ABN , First Publish Date - 2020-12-15T22:34:16+05:30 IST
బాలానగర్ ఫ్లైఓవర్ నిర్మాణంలో అగ్నిప్రమాదం సంభవించింది. వెల్డింగ్ పనులు చేస్తుండగా ధర్మకోల్ షీట్‌లో

హైదరాబాద్: బాలానగర్ ఫ్లైఓవర్ నిర్మాణంలో అగ్నిప్రమాదం సంభవించింది. వెల్డింగ్ పనులు చేస్తుండగా ధర్మకోల్ షీట్‌లో మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో ఆ పరిసరాల్లో దట్టంగా పొగ కమ్మేసింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది సంఘటనాస్థలికి చేరుకుని మంటలార్పారు.