ఇంటర్ ఫెయిల్‌అయిన వారిని పాస్‌చేయాలి
ABN , First Publish Date - 2020-06-22T20:15:04+05:30 IST
ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరంలో ఫెయిల్‌అయిన విద్యార్దులందరినీ పాస్ చేయాలని బాలల హక్కుల సంఘం డిమాండ్‌చేసింది.

హైదరాబాద్: ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరంలో ఫెయిల్‌అయిన విద్యార్దులందరినీ పాస్ చేయాలని బాలల హక్కుల సంఘం డిమాండ్‌చేసింది. రాష్ట్రంలో నెలకొన్న కరోనా తీవ్రత దృష్ట్యా సమీప భవిష్యత్‌లో ఫెయిల్‌అయిన విద్యార్దులకు అడ్వాన్స్ సప్లిమెంట్ పరీక్షలు నిర్వహించే పరిస్థితి లేదని, పక్కరాష్ట్రం ఏపీతో సహా కొన్నిరాష్ర్టాలు ఇంటర్మీడియట్ విద్యార్దులను ప్రమోట్ చేశాయని పేర్కొంది. దాదాపు అన్ని వివ్వవిద్యాలయాలు డిగ్రీ విద్యార్దులను సైతం పరీక్షలు నిర్వహించకుండానే అందరినీ ప్రమోట్ చేస్తున్నాయని ఈ విపత్కర పరిస్థితుల్లో ప్రాణాలు కాపాడుకోవడం తప్ప పరీక్షలకోసం చూసే సమయం కాదని ఆసంఘం గౌరవాధ్యక్షుడు అచ్యుతరావు పేర్కొన్నారు. ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం విద్యార్దులందరినీ ప్రయమోట్ చేయాలని బాలల హక్కుల సంఘం తరపున ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.