ఇంటర్ తప్పిన విద్యార్ధులకు 15 గ్రేస్ మార్కులు ఇవ్వాలి
ABN , First Publish Date - 2020-06-18T21:47:57+05:30 IST
ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో తప్పిన విద్యార్ధులకు 15 గ్రేస్ మార్కులు ఇవ్వాలని బాలల హక్కుల సంఘం ప్రభుత్వానికి విజ్ఞప్తిచేసింది

హైదరాబాద్: ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో తప్పిన విద్యార్ధులకు 15 గ్రేస్ మార్కులు ఇవ్వాలని బాలల హక్కుల సంఘం ప్రభుత్వానికి విజ్ఞప్తిచేసింది. ఇంటర్ మీడియట్‌లో తప్పిన విద్యార్ధులు ప్రస్తుత కొవిడ్ పరిస్థితుల్లో అడ్వాన్స్ సప్లిమెంటరీ రాసుకునే పరిస్థితి లేదని, పదిహేను గ్రేస్ మార్కులు ఇవ్వాలని, అలాగే పరీక్షలో ఉత్తీర్ణులుకాని వారిని తల్లిదండ్రులు నిందించ వద్దని సంఘం గౌరవ అధ్యక్షుడు అచ్యుతరావు విజ్ఞప్తిచేశారు. అలాగే విద్యార్దులు పరీక్ష తప్పినంత మాత్రాన జీవితంలో ఏదో కోల్పోయినట్టు భావించ వద్దని, తరువాయి పరీక్షలు రాసుకుని ఉత్తీర్ణులు కావచ్చని ఆయన తెలిపారు.