బాలల హక్కులనేత అచ్యుత రావు కరోనాతో మృతి

ABN , First Publish Date - 2020-07-22T23:46:57+05:30 IST

బాలల హక్కకల పై ఉద్యమించే నేతగా ప్రఖ్యాతి చెందిన బాలల హక్కుల సంఘం గౌరవాధ్యక్షుడు అచ్యుతరావు కరోనాకు బలయ్యారు.

బాలల హక్కులనేత అచ్యుత రావు కరోనాతో మృతి

హైదరాబాద్‌: బాలల హక్కకల పై ఉద్యమించే నేతగా ప్రఖ్యాతి చెందిన బాలల హక్కుల సంఘం గౌరవాధ్యక్షుడు అచ్యుతరావు కరోనాకు బలయ్యారు. కరోనాకు చికిత్సపొందుతూ బుధవారం మలక్‌పేటలోని యశోదా ఆస్పత్రిలో కన్నుమూశారు. బాల హక్కుల పరిరక్షణకు ముందుండే అచ్యుతరావు ఎక్కడ బాలబాలికలకు అన్యాయం జరిగినా స్పందించేవాడిగా పేరు పొందారు. గతంలో ఆయన రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ సభ్యుడిగా కూడా పనిచేశారు. చాలా కాలంలో బాలల హక్కుల పై ఉద్యమిస్తున్నారు. ఆయన మరణ వార్త తెలిసిన ఆయన అభిమానులు, వివిధ రంగాల ప్రముఖులు సంతాపం ప్రకటించారు. 

Updated Date - 2020-07-22T23:46:57+05:30 IST