బెయిల్‌ కోసం హైకోర్టును ఆశ్రయించిన రేవంత్

ABN , First Publish Date - 2020-03-13T17:27:12+05:30 IST

డ్రోన్ కెమెరా కేసులో బెయిల్ కోసం ఎంపీ రేవంత్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. కోర్టులో మూడు పిటిషన్లు దాఖలు చేశారు. నార్సింగి పీఎస్‌లో నమోదైన కేసు కొట్టివేయాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా మియాపూర్ కోర్టు విధించిన రిమాండ్‌ను

బెయిల్‌ కోసం హైకోర్టును ఆశ్రయించిన రేవంత్

హైదరాబాద్: డ్రోన్ కెమెరా కేసులో బెయిల్ కోసం ఎంపీ రేవంత్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. కోర్టులో మూడు పిటిషన్లు దాఖలు చేశారు. నార్సింగి పీఎస్‌లో నమోదైన కేసు కొట్టివేయాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా మియాపూర్ కోర్టు విధించిన రిమాండ్‌ను రద్దు చేయాలని అభ్యర్థించారు. పార్లమెంట్‌ సమావేశాలకు హాజరు కావాల్సి ఉన్నందున బెయిల్ మంజూరు చేయాలని మరో పిటిషన్ దాఖలు చేశారు. కాగా, రేవంత్ కేసును సుప్రీంకోర్టు న్యాయవాది సల్మాన్ ఖుర్షీద్ వాదించనున్నారు. కేసు వాదన కోసం ఏఐసీసీ నుంచి సల్మాన్ ఖుర్షీద్ ఆధ్వర్యంలో లాయర్ల బృందం హైదరాబాద్‌ చేరుకుంది. ఈ బృందం రేవంత్ కేసులను వాదించనుంది.

Updated Date - 2020-03-13T17:27:12+05:30 IST