వివేక్ పార్టీ మారుతున్నట్లుగా దుష్ప్రచారం: బీజేపీ
ABN , First Publish Date - 2020-12-27T08:21:44+05:30 IST
బీజేపీ సీనియర్ నేత వివేక్ వెంకటస్వామి పార్టీ మారుతున్నట్లుగా టీఆర్‌ఎస్, దాని అనుబంధ సంస్థలు సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నాయని కమల దళం ఆరోపించింది.

బీజేపీ సీనియర్ నేత వివేక్ వెంకటస్వామి పార్టీ మారుతున్నట్లుగా టీఆర్‌ఎస్, దాని అనుబంధ సంస్థలు సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నాయని కమల దళం ఆరోపించింది. ఈ ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ఎస్. ప్రకాశ్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ తప్పుడు ప్రచారంపైన తాము సైబర్ క్రైంలో ఫిర్యాదు చేయనున్నామని వెల్లడించారు.