నమ్మిన వారే ముంచారు..టీఆర్ఎస్‌కు భారీ వెన్నుపోట్లు..

ABN , First Publish Date - 2020-12-06T18:53:15+05:30 IST

గ్రేటర్ ఎన్నికల్లో అధికారపార్టీ నేతల మధ్య విబేధాలే కొంపముంచాయి.

నమ్మిన వారే ముంచారు..టీఆర్ఎస్‌కు భారీ వెన్నుపోట్లు..

హైదరాబాద్: గ్రేటర్ ఎన్నికల్లో అధికారపార్టీ నేతల మధ్య విబేధాలే కొంపముంచాయి. నేతలు సఖ్యతతో పనిచేయకపోవడంతో టీఆర్ఎస్ మెజారిటీ సీట్లు సాధించలేకపోయిందా? సిట్టింగ్‌లను కాదని కొత్తవారికి సీట్లు ఇచ్చిన చోట ఎలాంటి ఫలితాలు వచ్చాయి? వెన్నంటి ఉన్నవారే వెన్నుపోటు పొడిచారా? అన్ని చోట్ల ఎమ్మెల్యేలు తమకు అనుకూలంగా ఉన్నవారికే టికెట్లు ఇప్పించేందుకు ప్రయత్నం చేశారు. టీఆర్ఎస్ అధిష్టానం ఎమ్మెల్యేను కాదని సిట్టింగ్‌లకు అవకాశం ఇచ్చింది. దీంతో చాలా చోట్ల ప్రతికూల ఫలితాలు వచ్చాయని గణాంకాలు చెబుతున్నాయి. 


ముఖ్యంగా కార్పొరేటర్‌గా బలపడిన నేతలు భవిష్యత్తులో తమకు పోటీకి వస్తారని భావించి ఎమ్మెల్యేలు టిక్కెట్లు రాకుండా చేశారు. సాధ్యంకాని చోట సహాయనిరాకరణతో ఇబ్బందులు పెట్టారని అంచనా వేస్తున్నారు. అదే విధంగా ఎమ్మెల్యేలు పట్టుబట్టి తమ బంధువులకు టిక్కెట్లు ఇప్పించుకున్నచోట్ల స్థానిక నేతల సహాయ నిరాకరణతో టీఆర్ఎస్ ఓటమిపాలైంది.

Updated Date - 2020-12-06T18:53:15+05:30 IST