ఆయుష్‌ శస్త్రచికిత్సలకు అనుమతులు వద్దు

ABN , First Publish Date - 2020-12-12T05:29:48+05:30 IST

ఆయుష్‌ శస్త్రచికిత్సలకు అనుమతులు వద్దు

ఆయుష్‌ శస్త్రచికిత్సలకు అనుమతులు వద్దు

హన్మకొండ అర్బన్‌, డిసెంబరు 11: ఆయుష్‌ వైద్యులు శస్త్రచికిత్సలు చేయడానికి అనుమతులిస్తూ జారీ చేసిన గెజిట్‌ను రద్దు చేయాలని వరంగల్‌ విభాగం ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్‌ పి.సుధీర్‌కుమార్‌ డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ శుక్రవారం వరంగల్‌ ఐఎంఏ హాల్‌ ఎ దుట వైద్యులు, జూడాలు, మెడికోలు నిరసన తెలిపారు. డాక్టర్‌ సుధీర్‌కుమార్‌ మాట్లాడుతూ.. ‘ఆయుష్‌ శస్త్రచికిత్స’లను రద్దు చేసేవరకు ఐఎంఏ ఆధ్వర్యంలో ఉద్యమిస్తామని తెలిపారు. ఇందులో భాగంగా శుక్రవారం అత్యవసర విభాగాలు మినహా దేశవ్యాప్తంగా వైద్యులు స్వచ్ఛందంగా స్టెత్‌డౌన్‌ చే పట్టారని తెలిపారు. శస్త్రచికిత్సలపై నైపుణ్యం లేనివారికి వె ౖద్యులుగా గుర్తింపు ఇవ్వడం సరికాదని అన్నారు. అనంతరం వరంగల్‌ పర్యటనకు వచ్చిన కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డిని ఐఎంఏ ప్రతినిధులు, వైద్యులు కలిసి వినతిపత్రం అందజేశారు. ఐఎంఏ నాయకులు కార్యదర్శి డాక్టర్‌ ప్రభాకర్‌, కోశాధికారి డాక్టర్‌ రాజమోహన్‌, డాక్టర్‌ మన్మోహన్‌రాజు, డాక్టర్‌ విజయ్‌చందర్‌రెడ్డి, సుధీప్‌, డాక్టర్‌ పవన్‌, వైద్యులు, జానియర్‌ డాక్టర్లు పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-12T05:29:48+05:30 IST