ఐఐటీహెచ్‌లో అటానమస్ నావిగేషన్ టెస్ట్ బెడ్
ABN , First Publish Date - 2020-12-30T08:25:55+05:30 IST
ఐఐటీ హైదరాబాద్‌లో ఏర్పాటు చేయనున్న అటానమస్ నావిగేషన్ టెస్ట్ బెడ్‌కు కేంద్ర విద్యా శాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ మంగళవారం ఆన్‌లైన్ ద్వారా శంకుస్థాపన చేశారు. ఈ టెస్ట్ బెడ్ ద్వారా వాహనాలు, డ్రోన్లను మానవ రహితంగా

శంకుస్థాపన చేసిన కేంద్ర విద్యాశాఖ మంత్రి
కంది, డిసెంబరు 29 : ఐఐటీ హైదరాబాద్‌లో ఏర్పాటు చేయనున్న అటానమస్ నావిగేషన్ టెస్ట్ బెడ్‌కు కేంద్ర విద్యా శాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ మంగళవారం ఆన్‌లైన్ ద్వారా శంకుస్థాపన చేశారు. ఈ టెస్ట్ బెడ్ ద్వారా వాహనాలు, డ్రోన్లను మానవ రహితంగా నడిపించవచ్చు. ఇంటర్ డిసిప్లీనరీ సైబర్ ఫిజికల్ సిస్టమ్ అభివృద్ధికి సంబంధించిన జాతీయ మిషన్‌లో భాగంగా ఐఐటీహెచ్ ప్రాంగణంలో రూ.135 కోట్లతో రెండెకరాల్లో దీన్ని నిర్మించనున్నారు. ఐఐటీహెచ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విభాగం ప్రొఫెసర్ రాజ్యలక్ష్మి నేతృత్వంలో నావిగేషన్ వ్యవస్థలను అందుబాటులోకి తెచ్చేందుకు పరిశోధనలు చేయనున్నారు. ఈ పరిశోధన కేంద్రాన్ని ‘టిహాన్ ఫౌండేషన్’ అని పిలుస్తారు.