పల్టీలు కొట్టిన రెండు ఆటోలు

ABN , First Publish Date - 2020-12-14T04:21:07+05:30 IST

పల్టీలు కొట్టిన రెండు ఆటోలు

పల్టీలు కొట్టిన రెండు ఆటోలు
క్షతగాత్రులను అంబులెన్సులో తరలిస్తున్న సిబ్బంది

పదిమందికి గాయాలు, ఇద్దరి పరిస్థితి విషమం

బచ్చన్నపేట, డిసెంబరు 13: మండలంలోని రాంచంద్రాపూర్‌, కొన్నె గ్రామాల మధ్య ఆదివారం సాయంత్రం ముందు వెళుతున్న ఆటోను ఓవర్‌టేక్‌ చేయబోతూ రెండు ఆటోలు పల్టీలు కొట్టాయి. ఈ ప్రమాదంలో పదిమంది గాయపడగా ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. సిద్దిపేట జిల్లా జగదేవ్‌పూర్‌ మండలం తీగుళ్ల గ్రామానికి చెందిన 20 మంది పెద్దలు, ఐదుగురు పిల్లలు కలిసి రెండు ఆటోల్లో రాంచంద్రాపూర్‌ గ్రామంలో జరిగిన ఓ శుభకార్యానికి హాజరై సాయంత్రం తిరిగి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. డ్రైవర్‌ ఓవర్‌ స్పీడ్‌తో ఆటో నడపటం వల్లే ఈ ప్రమాదం జరిగిందని అందులో ఉన్నవారు తెలిపారు. ఈ ఘటనలో ఉస్మాన్‌, నూర్జాన్‌, గౌసియా, పర్విన్‌, దస్తగిరి, రజియాబేగం, ఫర్హానా, ఎక్భాల్‌, సుమెదా, యాకూబీ గాయపడగా వారిలో ఉస్మాన్‌, రజియాబేగంలకు తీవ్ర గాయాలయ్యాయి. ఎస్సై లక్ష్మణ్‌రావు సిబ్బందితో వెళ్లి క్షతగాత్రులను బచ్చన్నపేట పీహెచ్‌సీకి తరలించి ప్రాథమిక చికిత్స అనంతరం అంబులెన్సుల్లో జనగామ ఏరియా ఆస్పత్రికి తరలించారు. జరిగిన ఘటనపై కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2020-12-14T04:21:07+05:30 IST