భయాందోళనలతో ఆటో డ్రైవర్ ఆత్మహత్య
ABN , First Publish Date - 2020-10-28T07:08:43+05:30 IST
ఆటో బోల్తా పడి ఐదుగురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడటంతో భయాందోళనలతో ఓ డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్నాడు. నల్లగొండ

ఆటో బోల్తా..
ఐదుగురికి గాయాలు కావడంతో బలవన్మరణం
పెద్దవూర, అక్టోబరు 27: ఆటో బోల్తా పడి ఐదుగురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడటంతో భయాందోళనలతో ఓ డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్నాడు. నల్లగొండ జిల్లా పెద్దవూర మండలం పర్వేదుల గ్రామ శివారులో ఈ ఘటన జరిగింది. దామరచర్ల మండలం వాచ్యతండాకు చెందిన లావూరి బిక్షం(35) సొంత ఆటో నడుపుతూ జీవిస్తుండేవాడు. దసరాకు వాచ్యతండాకు చెందిన 9 మంది ఆటోను కిరాయికి మాట్లాడుకుని ఈ నెల 25న పీఏపల్లి మండలం వద్దిపట్లకు వచ్చారు.
స్వగ్రామానికి తిరిగి వెళుతుండగా సోమవారం సాయంత్రం ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. ఆటోలో ఉన్న 9 మందిలో ఐదుగురు తీవ్రంగా గాయపడగా, 108 అంబులెన్సులో ఆసుపత్రికి తరలించారు. ఆటో బోల్తా పడిన స్థలానికి సమీపంలో డ్రైవర్ బిక్షం చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవడాన్ని గుర్తించిన స్థానికులు మంగళవారం ఉదయం పోలీసులకు సమాచారమిచ్చారు.