రసమయి బాలకిషన్‌ బెదిరింపుల ఆడియో లీక్‌

ABN , First Publish Date - 2020-11-07T21:24:28+05:30 IST

తెలుగు రాష్ట్రాల్లో కొంతమంది ప్రజా ప్రతినిధులు నోటికి పనిచెబుతున్నారు. నోటికి ఎంత వస్తే అంత మాట అనేస్తున్నారు. తమ సమస్యలకు పరిష్కరించాలని

రసమయి బాలకిషన్‌ బెదిరింపుల ఆడియో లీక్‌

సిద్దిపేట: తెలుగు రాష్ట్రాల్లో కొంతమంది ప్రజా ప్రతినిధులు నోటికి పనిచెబుతున్నారు. నోటికి ఎంత వస్తే అంత మాట అనేస్తున్నారు. తమ సమస్యలను పరిష్కరించాలని ప్రజలు కోరితే.. ప్రజాప్రతినిధులు శివాలెత్తుతున్నారు. అంతేకాదు అంతుచేస్తామని బెదిరిస్తున్నారు. మొన్న ఏపీలో ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ఓ అధికారిని ఇష్టమొచ్చినట్లు తిట్టారు. ఇవాళ తెలంగాణలో ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కూడా ఓ వ్యక్తిపై చిందులేశారు.


రసమయి బాలకిషన్‌ బెదిరింపుల ఆడియో లీకయింది. స్థానిక సమస్యలను సోషల్ మీడియాలో ప్రశ్నించినందుకు యువకుడిని అసభ్యపదజాలంతో బాలకిషన్‌ దూషించారు. అంతేకాదు  బెజ్జంకి మండలం బేగంపేటకు చెందిన యువకుడిని బెదిరించారు. ఇంకోసారి నియోజకవర్గ సమస్యలపై సోషల్ మీడియాలో పెడితే అంతు చూస్తానని యువకుడిపై రసమయి ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. బాలకిషన్ నోటి దురుసుపై పలువురు మండిపడుతున్నారు. నియోజకవర్గ సమస్యలను పరిష్కరించకుండా.. ప్రశ్నించిన యువకుడిని బెదిరించడం ఏమిటని స్థానికులు బాలకిషన్ తీరుపై మండిపడుతున్నారు. 


అనంతపురం జిల్లా రాయదుర్గం మొలకాల్మూరు రోడ్డులోని ఇసుక నిల్వ కేంద్రం ఇన్‌చార్జ్‌పై ఫోన్లో తీవ్రస్థాయిలో కాపు రామచంద్రారెడ్డి విరుచుకుపడిన విషయం తెలిసిందే. ‘‘ఇసుకను మరో ప్రాంతానికి ఎలా తరలిస్తావు... చెప్పు తెగేదాకా కొడతా... నీ ఇష్టమొచ్చినట్లు తరలిస్తే నీ...’’ అంటూ ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి నోరు చేసుకొన్నారు. ఇసుక నిల్వ కేంద్రం ఇన్‌చార్జిపై ఆయన రాయలేని బూతులతో విరుచుకుపడిన ఆడియో హల్‌చల్‌ చేస్తోంది. 

Updated Date - 2020-11-07T21:24:28+05:30 IST