ఐడీ కార్డులతో విధులకు హాజరుకండి
ABN , First Publish Date - 2020-03-24T10:44:51+05:30 IST
తెలంగాణ లాక్‌డౌన్ నేపథ్యంలో విద్యుత్ శాఖ ఉద్యోగులు గుర్తింపు కార్డులతో విధులకు హాజరుకావాలని ట్రాన్స్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు ఆదేశించారు.

విద్యుత్ ఉద్యోగులకు సీఎండీ ప్రభాకర్‌రావు ఆదేశం
హైదరాబాద్, మార్చి 23 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ లాక్‌డౌన్ నేపథ్యంలో విద్యుత్ శాఖ ఉద్యోగులు గుర్తింపు కార్డులతో విధులకు హాజరుకావాలని ట్రాన్స్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు ఆదేశించారు. ఈనెల 31 దాకా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, కరోనా వ్యాప్తి నేపథ్యంలో కరెంట్ బిల్లులను ఇంటినుంచే చెల్లించాలని డిస్కమ్‌లు విజ్ఞప్తి చేశాయి. ఎస్పీడీసీఎల్ వెబ్‌సైట్/యాప్, పేటీఎం, బిల్ డెస్క్, టీ వాలెట్, టీఏ-వాలెట్, ఫోన్‌పే ద్వారా చెల్లించవచ్చని తెలిపాయి.