అత్తామామపై బీరు సీసాలతో అల్లుడి దాడి

ABN , First Publish Date - 2020-10-07T14:48:04+05:30 IST

రాజన్న సిరిసిల్ల: గంభీరావుపేట మండలం రాజేశ్వరరావు కాలనీలో దారుణం చోటు చేసుకుంది.

అత్తామామపై బీరు సీసాలతో అల్లుడి దాడి

రాజన్న సిరిసిల్ల: గంభీరావుపేట మండలం రాజేశ్వరరావు కాలనీలో దారుణం చోటు చేసుకుంది. అత్త, మామపై బీరు సీసాలతో అల్లుడు దాడికి పాల్పడ్డాడు. తన ఇద్దరు అనుచరులతో కలిసి అల్లుడు దాడికి తెగబడ్డాడు. మామ రాజయ్య, అత్త రాజవ్వకు తీవ్రగాయాలయ్యాయి. పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. రూ.12 లక్షల విలువ చేసే ఇల్లు తన పేరు మీద రాయాలంటూ ఘాతుకానికి పాల్పడ్డాడు.

Read more