నారాయణపూర్‌లో పోలీసులపైౖ దాడి

ABN , First Publish Date - 2020-03-28T10:18:50+05:30 IST

విధి నిర్వహణలో ఉన్న ఎస్‌ఐ, కానిస్టేబుళ్లపై ఆరుగురు వ్యక్తులు దాడి చేసిన ఘటన వికారాబాద్‌ జిల్లా తాండూరు మండలం నారాయణపూర్‌లో శుక్రవారం రాత్రి చోటు

నారాయణపూర్‌లో పోలీసులపైౖ దాడి

ఎస్‌ఐ, కానిస్టేబుల్‌కు గాయాలు

 తాండూరు రూరల్‌,  మార్చి 27 : విధి నిర్వహణలో ఉన్న ఎస్‌ఐ, కానిస్టేబుళ్లపై ఆరుగురు వ్యక్తులు దాడి చేసిన ఘటన వికారాబాద్‌ జిల్లా తాండూరు మండలం నారాయణపూర్‌లో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కరన్‌కోట్‌ ఎస్‌ఐ సంతో్‌షకుమార్‌, కానిస్టేబుళ్లు శ్రీకాంత్‌, రవి, ఆయిశ మరో ఇద్దరితో కలిసి గ్రామాన్ని సందర్శించేందుకు వెళ్లారు. గ్రామంలో వడ్ల బిచ్చణ్ణ, వీరాచారి, మునేశ్వర్‌, వినయ్‌చారి, వెంకటప్ప, శ్రీశైలం బయట కూర్చోని ఉండగా, వారిని ఇళ్లలోకి వెళ్లాలని సూచించారు. దీంతో వారు పోలీసులతో వాదనకు దిగారు. మాటామాటా పెరిగి రాళ్లు, కర్రలతో పోలీసులపై దాడికి దిగారు. ఈ దాడిలో ఎస్‌ఐ సంతో్‌షకుమార్‌ కన్ను పై భాగంలో గాయం కాగా, కానిస్టేబుల్‌ శ్రీకాంత్‌, ఆయిశలకు గాయాలయ్యాయి. ఉన్నతాధికారులు అదనపు బలగాలను గ్రామానికి పంపించి ఆరుగురిని అదుపులోకి తీసుకుని పోలీ్‌స స్టేషన్‌కు తరలించారు.

Updated Date - 2020-03-28T10:18:50+05:30 IST