పెళ్లికి ఒప్పుకోలేదని యువతిపై దాడి

ABN , First Publish Date - 2020-09-21T21:47:29+05:30 IST

పెళ్లికి ఒప్పుకోలేదని యువతిపై దాడి

పెళ్లికి ఒప్పుకోలేదని యువతిపై దాడి

నల్గొండ: జిల్లాలోని చింతపల్లి మండలం కిష్టరాంపల్లిలో దారుణఘటన చోటుచేసుకుంది. పెళ్లికి ఒప్పుకోలేదని యువతి తలపై బీరు బాటిల్‌తో యువకుడు దాడికి పాల్పడ్డాడు. యువతి చనిపోయిందన్న భయంతో వెంటనే ఆ యువకుడు వాటర్‌ట్యాంక్‌ పైనుంచి దూకేశాడు. ప్రస్తుతం ఆ ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు  సంఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

Updated Date - 2020-09-21T21:47:29+05:30 IST