హైదరాబాద్: కొన్ని ప్రైవేటు ఆస్పత్రులలో దారుణాలు

ABN , First Publish Date - 2020-07-19T21:27:09+05:30 IST

నగరంలోని కొన్ని ప్రైవేటు ఆస్పత్రులలో దారుణాలు చోటు చేసుకుంటున్నాయి.

హైదరాబాద్: కొన్ని ప్రైవేటు ఆస్పత్రులలో దారుణాలు

హైదరాబాద్: నగరంలోని కొన్ని ప్రైవేటు ఆస్పత్రులలో దారుణాలు చోటు చేసుకుంటున్నాయి. పేషెంట్లనే కాదు..నర్సులను ఆస్పత్రులు పీడిస్తున్నాయి. పని చేస్తున్న పొరుగు రాష్ట్రాల నర్సులను బెదరించి మరీ డ్యూటీలు చేయిస్తున్నాయి. మెహిదీపట్నంలోని ఆలివ్ ఆస్పత్రిలో పని చేస్తున్న తమిళనాడుకు చెందిన నర్సులు ఆరోపణలు చేశారు. కొందరికి కరోనా లక్షణాలు ఉన్నా, మరికొందరు కరోనా బారిన పడినా మందులేసుకుని డ్యూటీలకు రావాలని బెదిరిస్తున్నారని నర్సులు ఆరోపించారు. డ్యూటీలకు రాకపోతే జీతాలు ఇవ్వబోమని బెదిరిస్తున్నారని చెప్పారు. తమను తెలంగాణ ప్రభుత్వం ఆదుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. 

Updated Date - 2020-07-19T21:27:09+05:30 IST