5 పదుల వయసులో.. కోటి అడుగులు

ABN , First Publish Date - 2020-12-13T08:06:00+05:30 IST

ఉదయం లేచింది మొదలు రాత్రి నిద్రపోయే వరకు మనం ఎంతదూరం నడుస్తున్నాం ? నడక, బైక్‌/కారు ఈ రెండింటిలో దేన్ని ఎక్కువ వాడుతున్నాం ?

5 పదుల వయసులో.. కోటి అడుగులు

గిన్నిస్‌ రికార్డుకు చేరువలో వాకింగ్‌ స్టార్‌ 

రోజూ 8 నుంచి 10 గంటల పాటు నడకే 

 సీఆర్పీఎఫ్‌ విశ్రాంత ఇన్‌స్పెక్టర్‌ రవికుమార్‌ ఘనత

తార్నాక, డిసెంబరు 12 (ఆంధ్రజ్యోతి) : ఉదయం లేచింది మొదలు రాత్రి నిద్రపోయే వరకు మనం ఎంతదూరం నడుస్తున్నాం ? నడక, బైక్‌/కారు ఈ రెండింటిలో దేన్ని ఎక్కువ వాడుతున్నాం ? ఔనన్నా.. కాదన్నా.. నడకకు ప్రాధాన్యం ఇచ్చే వారి సంఖ్య చాలా తక్కువ అనేదే వాస్తవం. ఇలాంటి సమయంలోనూ హైదరాబాద్‌కు చెందిన 54 ఏళ్ల సీఆర్పీఎఫ్‌ విశ్రాంత ఇన్‌స్పెక్టర్‌ కోట్‌నాట్‌ మఠం రవికుమార్‌ వా‘కింగ్‌’ స్టార్‌గా అందరి మన్ననలు అందుకుంటున్నారు. నడకే ఆరోగ్యానికి తారక మంత్రం అని ఆయన ఉద్బోధిస్తున్నారు. నీతులు చెప్పడమే కాదు.. ఆచరించి చూపుతున్నారు.


ఆయన 2020 జనవరి 1 నుంచి ఇప్పటివరకు ప్రతిరోజు 8 గంటల నుంచి 10 గంటల సమయాన్ని నడకకే కేటాయించారు. రోజుకు 27,500 అడుగులు చొప్పున డిసెంబరు 11 నాటికి 93.81 లక్షల అడుగుల దూరం కాలును కదిపారు. డిసెంబరు 31 నాటికి 1 కోటి అడుగుల లక్ష్యాన్ని పూర్తి చేసి గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్‌లో పేరును రిజిస్టర్‌ చేసుకుంటానని రవికుమార్‌ తెలిపారు. తన రికార్డును ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అంకితమిస్తానని చెప్పారు. 


Updated Date - 2020-12-13T08:06:00+05:30 IST